శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Aug 20, 2020 , 00:07:38

ఫొటోలు సజీవ సాక్ష్యాలు

ఫొటోలు సజీవ సాక్ష్యాలు

  • - ఫొటో జర్నలిస్టులను సన్మానించిన కలెక్టర్‌, ఎమ్మెల్యే

సంగారెడ్డి టౌన్‌ : ఫొటోలు సజీవ సాక్ష్యాలుగా ఉంటాయని, తరతరాల చరిత్రను ఫొటోల ద్వారా తెలుసుకోవచ్చని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితుల్లో ఫొటోజర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు. ఫొటోగ్రాఫర్లు ఎంతో కష్టపడి అత్యుత్తమ ఫొటోలు సేకరిస్తారన్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఫొటోగ్రాఫర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఫొటో జర్నలిస్టులను జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, కలెక్టర్‌ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, డీపీఆర్‌వో విజయలక్ష్మి, ఫొటో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.