గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Jul 18, 2020 , 23:03:30

పల్లెలకు మహర్దశ

పల్లెలకు మహర్దశ

పటాన్‌చెరు, నమస్తేతెలంగాణ :  ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గంలోని 17 గ్రామపంచాయతీల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని 55 గ్రామపంచాయతీల్లో అభివృద్ధిపనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 17 గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణాలను పూర్తిచేసుకుని ప్రారంభించామన్నారు. ప్రతి గ్రామంలో చెత్త సేకరణ కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయని, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. గ్రామాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలికవసతులను కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకుండా తడి,పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పల్లెలకు మహర్దశ వచ్చిందన్నారు. మిషన్‌భగీరథతో ఇంటింటికీ గోదావరి నీటిని సరఫరా చేశామని. గ్రామాల్లో చెరువు, కుంటలకు పూర్వవైభవం తీసుకువచ్చామన్నారు. కరోనా వైరస్‌తో దేశమంతా లాక్‌డౌన్‌తో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పటికీ, రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండింట్లో తెలంగాణ సర్కారు ముందు వరుసలో ఉన్నదని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలుస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్త్తోందన్నారు. అభివృద్ధి విషయంలో పటాన్‌చెరును అగ్రస్థానంలో నిలుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీవేణుగోపాల్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ స్వప్నశ్రీనివాస్‌, ఎంపీడీవో రవీందర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పాండు, వెంకట్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


logo