ఆఫీస్ స్పేస్ లీజింగ్‌కు ఊపు

లాక్డౌన్ ఫలితంగా కార్పొరేట్ కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాయి. దీనివల్ల దేశ వ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ పడిపోయిన మాట వాస్తవమే. అయితే 2021లో ఇది చాలావరకు మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. దీంట్లో 2020 ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్షీణించిన తీరును ప్రస్తావిస్తూ.. 2021లో అది జోరుగా పుంజుకునే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2020లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 44% క్షీణించి 25.82 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. 2019 విషయానికి వస్తే నికర ఆఫీస్ స్పేస్ లీజింగ్ 46.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటే, అది 2020 జనవరి- మార్చి మధ్యకాలంలో 8.8 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ఇక రెండో త్రైమాసికంలో 3.32 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది. అయితే ఇది 2021లో గణనీయంగా పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2019 నాటి ఆఫీస్ స్పేస్ లీజింగ్‌ను బద్దలుకొట్టే అవకాశాలు కూడా ఉన్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడం వల్ల హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఇప్పటికే నికర ఆఫీస్ స్పేస్ వినియోగం మెరుగైందని చెప్తున్నారు.
తాజావార్తలు
- టోక్యో ఒలింపిక్స్ రద్దు.. జపాన్ ప్రభుత్వ నిర్ణయం!
- ఎఫ్బీ డేటా చోరీ.. క్యాంబ్రిడ్జ్ అనలిటికాపై సీబీఐ కేసు
- రెండోదశలో జర్నలిస్టులకూ కరోనా టీకా!
- పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదం.. లక్ష్య టీజర్
- హరితేజకూ హ్యాకింగ్ కష్టాలు తప్పలేదు..!
- వరల్డ్ రికార్డ్.. ఇలాంటి గోల్ ఎప్పుడైనా చూశారా.. వీడియో
- తెలంగాణలో కొత్తగా 214 కరోనా కేసులు
- సీఎం పదవి ప్రతి నాయకుడి కల.. నేనూ అంతే
- మంచి మీల్, ప్రేమానురాగాలు ఉంటే చాలు: రేణూ దేశాయ్
- వరుసపెట్టి పేలిన 50 డైనమైట్లు..