తాండూరు : ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని, శాసన సభ, మండలిలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ( MLC Mahender Reddy) పేర్కొన్నారు. గురువారం తాండూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమేనని తెలిపారు.
విజయాలు వచ్చినప్పుడు పొంగిపోవడం, అపజయం వచ్చినప్పుడు కుంగిపోవడం బీఆర్ఎస్ నైజాం కాదన్నారు. పార్టీ కోసం శ్రమించిన నాయకులకు, కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామిలన్నీ అధికార కాంగ్రెస్ నెరవేర్చాలన్నారు. తాండూరు నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయలను తీసుకొచ్చానని గుర్తు చేశారు. పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం 17న నిర్వహించనున్న అయ్యప్ప స్వామి మహా పడిపూజకు నియోజకవర్గంలోని అయ్యప్ప స్వాములు, భక్తులు, నేతలు, ప్రజలు అధిక సంఖ్యలో రావాలని కోరారు.