సిడ్నీ : ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షటర్లు పీవీ సింధు, తన్వీ శర్మ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ పీవీ సింధు 21-13, 21-11తో ఇనెస్ లూసియా కాస్టిలో(పెరూ)పై అలవోక విజయం సాధించగా.. యంగ్ షట్లర్ తన్వీ 21-12, 22-20తో ప్రపంచ నంబర్11 షట్లర చీయు పిన్ చియాన్(చైనీస్ తైపీ)కు షాకిచ్చింది.
మరో పోరులో తాన్య హేమంత్ 21-17, 21-18తో ఇషికా జైస్వాల్(అమెరికా)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జ్ 19-21, 21-14, 15-21తో జస్టిన్ హో(మలేషియా) చేతిలో, తరుణ్ 21-18, 13-21, 23-25తో లిన్ యున్ యి(చైనీస్ తైపీ) చేతిలో, సనీత్ 8-21, 10-21తో హు జియాన్(చైనా) చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్‌లో ధృవ్ రావత్- మనీషా రెండో రౌండ్లోకి ప్రవేశించారు.