ముల్లాన్పూర్ : అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా సిరీస్కు దూరమయ్యాడు. వెన్నునొప్పి నుంచి కోలుకుని బీసీసీఐ సీవోఈలో ఉన్న పాండ్యా తిరిగి గాయపడ్డాడు.
ఫిట్నెస్ నిరూపించుకునే క్రమంలో పది ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా..పక్కటెముకల గాయంతో సిరీస్ నుంచి వైదొలిగాడు. దీంతో శనివారం నుంచి మొదలయ్యే..వన్డే సిరీస్కు అతను అందుబాటులో ఉండటం లేదనిబీసీసీఐ వర్గాలు తెలిపాయి.