వికారాబాద్ : వికారాబాద్‌లోని మహావీర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఒకే రోజు ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. వికారాబాద్ జిల్లా నవపేట్ మండలం మినపల్లి కలాంకు చెందిన ఐదునెలల పాప, చించెల్ పేట్ కు చెందిన 18నెలల బాబు చికిత్స కోసం దవాఖానలో చేరారు.
అయితే సీనియర్ డాక్టర్స్ అందుబాటులో లేకుండా సెల్‌ఫోన్స్‌లో జూనియర్ డాక్టర్స్‌కు సూచనలు అందించడం వల్లే చిన్నారులు మృతి చెందారని బాధితుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.