పరిగి, జనవరి 23 : ఓటుహక్కు అత్యంత విలువైందని పరిగి తహసీల్దార్ వెంకటేశ్వరి పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పరిగిలోని తహసీల్దార్ కార్యాలయం, జెడ్పీహెచ్ఎస్ నెం.1, జ్యోతిబాపూలే గురుకులంలో జరిగిన కార్యక్రమాలలో తహసీల్దార్ వెంకటేశ్వరి, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్, ఎంఈవో గోపాల్‌లు పాల్గొని విద్యార్థులు, ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు.
ఓటుహక్కు అనేది వజ్రాయుధం లాంటిదని, సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రతి ఓటరుకు ఒక అవకాశం కలుగుతుందని తెలిపారు. ఓటరు నమోదుపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగియుండాలని సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.