Stray dogs | దోమ, జూన్ 14 : వీధి కుక్కల దాడిలో వ్యక్తికి గాయాలైన ఘటన దోమ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. దోమ గ్రామానికి చెందిన బోయిని కిష్టప్ప శనివారం మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామ సమీపంలోని నల్ల చెరువులోకి దిగాడు. అయితే అదే సమయంలో అక్కడే గుంపుగా ఉన్న వీధి కుక్కలు అతడిపై దాడి చేసి గాయపరిచాయి. గాయాలైన కిష్టప్ప చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాడు.
ఈ ఘటన నేపథ్యంలో కిష్టప్ప మాట్లాడుతూ.. గ్రామంలో వీధి కుక్కల బెడద ఎక్కువై చిన్నపిల్లలు, పెద్దవారిపై సైతం సమూహాలుగా వచ్చి దాడులు చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని.. మనుషులఫై దాడులు జరగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని బోయిని కిష్టప్ప కోరారు.
కుట్రతోనే కేటీఆర్‌కు నోటీసులు.. ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కాంగ్రెస్‌వి డైవర్షన్ రాజకీయాలు.. మధుసూదనాచారి
Kaleru Venkatesh | పేదలకు ఆపత్కాలంలో ఆర్థిక చేయూత ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్