వికారాబాద్, ఏప్రిల్ 14 : యువకులు మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతూ కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని మిగిల్చుతున్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి, 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా వికారాబాద్ జిల్లా పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో అరైవ్ – అలైవ్ నినాదంతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దీపక్‌తివారి, జిల్లా ఎస్పీ స్నేహమెహ్రా, అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌లు హాజరయ్యారు.
ఈ సందర్బంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ మైనర్లకు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకుండా బాధ్యత తీసుకోవాలన్నారు.
ప్రతి ఒక్కరూ హెల్మేట్ ధరించి, సీట్ బెల్ట్ దరించి ట్రాఫిక్ నియమ నిబంధనలు, రోడ్ సేఫ్టీ ప్రమాదాలు పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, అదనపు ఎస్పీ రాములునాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.