కులకచర్ల, సెప్టెంబర్ 30 : ఒక్క సీసీ కెమెరా 100మంది పోలీసులతో సమానమని కులకచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో సీసీ కెమెరాలపై గ్రామస్తులకు అవగాహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడుతాయని అన్నారు.
సీసీ కెమెరాలతో కొన్ని ప్రత్యేక మైన సందర్భాల్లో నేరాలను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడుతాయని అన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వ్యాపార సముదాయాల్లో, పెద్ద ఇండ్ల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.