కులకచర్ల, ఏప్రిల్ 28 : పోస్టాఫీసు సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు పోస్టాఫీసు సబ్‌డివిజన్ ఇన్స్పెక్టర్ రాకేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం చౌడాపూర్ మండల పరిధిలోని లింగంపల్లి గ్రామం లో పోస్టాఫీసు నూతన బ్రాంచిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టాఫీసు సేవలను మరిం సులభతరం చేసేందుకు ముజాహిద్పూర్ పోస్టాఫీసు పరిధిలోని ఆరు గ్రామాలను కలుపుతూ నూతన పోస్టాఫీసు లింగంపల్లిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మారుతున్న ప్రజా అవసరాలకు అనుగుణంగా పోస్టాఫీసులు ఆర్థిక, బీమా, ఆధార్, ఐపీబీబీ వంటి ఎన్నో సేవలను అందిస్తుందని అన్నారు. ప్రజలు పోస్టాఫీసు సేవలను మరింతగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి గ్రామ ప్రత్యేక అధికారి రమేశ్, పంచాయతీ కార్యదర్శి రాధ, బస్ ఫోస్ట్ మాస్టర్ సాయి, మేయిల్ ఓవర్సీస్ రమేశ్, పోస్టల్ సిబ్బంది, గ్రామనాయకులు, ప్రజలు పాల్గొన్నారు.