అంగన్వాడీలకు ఫోన్ల కొనుగోలులో భారీ స్కామ్
పోషణ్ అభియాన్ పథకం కింద అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల కొనుగోలులో భారీ కుంభకోణానికి తెరతీశారని, దీనిపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ మంగళవారం డిమాండ్ చేశారు. ఫోన్ల కొనుగోలు మాటున దాదాపు రూ.8.5 కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర చేశార ని ఆరోపించారు.
- మొబైల్ టెండర్లలో అవినీతి..
- రూ.8.5 కోట్లు కొల్లగొట్టే కుట్ర
- అవినీతిపై విచారణ జరిపించాలి
- బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ డిమాండ్
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : పోషణ్ అభియాన్ పథకం కింద అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల కొనుగోలులో భారీ కుంభకోణానికి తెరతీశారని, దీనిపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ మంగళవారం డిమాండ్ చేశారు. ఫోన్ల కొనుగోలు మాటున దాదాపు రూ.8.5 కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర చేశార ని ఆరోపించారు. మంత్రి సీతక్క నేతృత్వంలో అంగన్వాడీ టీచర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, బ్లాక్ సమన్వయకర్తలకు ఫోన్ సదుపా యం కల్పించడంతోపాటు బఫర్ స్టాక్గా మరో 748 ఫోన్లు కలిపి మొత్తం 38,130 మొబైల్ ఫోన్ల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించారని తెలిపారు. సామ్సంగ్ గెలాక్సీ ఏ06 (4/64జీబీ) ఫోన్ల సరఫరాకు గాను ఓ కంపెనీ రూ.54,19, 41,690కి కాంట్రాక్టు దక్కించుకున్నదని వివరించారు.
ఈ మొత్తం డబ్బుతో 38,130 మొబై ల్ ఫోన్లు కొనుగోలు చేస్తే.. ఒక్కో దానికి రూ.14,213 అవుతుందని తెలిపారు. కానీ ప్రభుత్వం కోరుతున్న శా మ్సంగ్ మోడల్ మార్కెట్లో కేవలం రూ.11,999కే లభిస్తున్నదని వివరించారు. ఈ లెక్కన 38,130 ఫోన్లకు రూ.45,75, 21,870 ఖర్చవుతుందని తెలిపారు. కానీ ప్రభుత్వం మార్కెట్ రేట్లో లభిస్తున్న ఫోన్లకే రూ.8.44 కోట్లు అదనంగా చెల్లిస్తున్నదని తెలిపారు. ఈ మొత్తం ఎవరి జేబులోకి వెళుతున్నదో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దండుకొనేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. వెంటనే ఈ టెండర్లను రద్దుచేసి ఈ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవికి ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

