పరిగి, జూన్ 9 : ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ అన్నారు. సోమవారం పరిగి మండల పరిధిలోని రాజాపూర్, మిట్టకోడూరు, గ్రామాల్లో పర్యటించి ఇటీవల 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా విద్యను అందిస్తారని తెలిపారు.
పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందించడంతో పాటు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌సౌకర్యం కూడా ఉందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోనే 74శాతం ఉత్తీర్ణత శాతం పరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల సాధించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రవి, ప్రభాకర్, గోపాల్, వరస్వామి, వెంకటేశ్, గణేశ్, బాలగణేశ్ తదితరులు పాల్గొన్నారు.