బొంరాస్ పేట,జూన్ 11 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామపార్టీ అధ్యక్షుడు శేరి తుల్జా రెడ్డి తండ్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు శేరి నారాయణరెడ్డి, రేగడి మైలారం గ్రామానికి చెందిన పట్లోల వెంకటరెడ్డి మృతి చెందారు.
విషయం తెలుసుకున్న నరేందర్రెడ్డి బాధితుల ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవరు కూడా ఆధైర్యపడొద్దు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునేది బీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు.