బొంరాస్పేట్,ఏప్రిల్ 17 : గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను పెంచేందుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. వాటి ఏర్పాటుతో గ్రామాల్లో పచ్చదనం పెరగడంతో పాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో నష్టం జరిగినట్లే పల్లె ప్రకృతి వనాల సంరక్షణ కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురై మొక్కలు ఎండిపోతున్నాయి. తాజాగా బొంరాస్పేట్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న పల్లెప్రకృతివనం సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పల్లెప్రకృతి వనాల నిర్వహణ కోసం నిధులను కేటాయించి వాటి నిర్వహణ చూసుకోవడంతో నాడు పచ్చగా కళకళలాడుతూ ఉండేవి. నేడు నిధుల లేకపోవడంతో నిర్వహణను గాలికి వదిలేయడంతో ఎండిపోయి కళాహీనంగా మారాయి.పల్లె ప్రకృతి వనాలను సంరక్షించి వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని గ్రామప్రజలు కోరుతున్నారు.