కులకచర్ల, నవంబర్ 16 : వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉన్న మిషన్ భగీరథ ట్యాంకు నిండి ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు నీరు వృధాగా పోతున్నా మిషన్ భగీరథ సిబ్బంది పట్టించుకోక పోవడంతో తహసీల్దార్ కార్యాలయం దగ్గర బురదమయంగా మారింది. గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిని సక్రమంగా సరఫరా చేయడం లేదు.
దీంతో కులకచర్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం దగ్గరే మిషన్ భగీరథ నీరు వృధాగా పోతున్నా.. తహసీల్దార్ కార్యాలయం నీటితో నిండినట్లుగా ఉన్నా మిషన్ భగీరథ సిబ్బందిగాని, అధికారులు గాని పట్టించుకోక పోవడంతో పలువురు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి నీరు ఇలా వృధాగా వెళుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.