వికారాబాద్, జూన్ 13: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ (Methuku Anand) ఆకాంక్షించారు. రెండు రోజుల క్రితం బాత్రూంలో జారిపడటంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎడమ కాలి తొడ ఎముక ఫ్రాక్చర్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడ యశోద దవాఖానకు తరలించారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ నేపథ్యంలో శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి తో కలిసి మెతుకు ఆనంద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.