స్టేషన్‌ఘన్‌పూర్, ఫిబ్రవరి 20: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అనేక పదవులు అనుభవించిన కడియం శ్రీహరి ఫిరాయింపులకు రారాజని, నమ్మకద్రోహానికి పరాకాష్ట అని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. పదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌ను విమర్శించేందుకు నీకు నోరెలా వచ్చిందని మండిపడ్డారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఎమ్మెల్యే కడియం శ్రీహ రి పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పం పిణీ చేసిన అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను విమర్శిస్తూ మాట్లాడారు.
కడియం వ్యాఖ్యలపై శుక్రవా రం సోషల్ మీడియా వేదికగా రాజయ్య స్పందించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితమైతే జీవచ్చవంలా ఉన్న నిన్ను కేసీఆర్ దయతలచి పార్టీలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీగా, ఎంపీగా, డిప్యూటీ సీఎం గా, విద్యాశాఖ మంత్రి అనేక పదవులు అనుభవించి, ఇప్పుడు పార్టీని, కేసీఆర్‌ను విమర్శించడం సభ్యసమా జం సిగ్గుపడేలా ఉందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలి చి, కాంగ్రెస్‌లో చేరిన నీవు, ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉ న్నానని చెప్పుకుంటూ కేసీఆర్‌పై మాట్లాడడం ఎంతవర కు సమంజసమన్నారు.
కేసీఆర్‌ను నీ నోటితోనే ఒకప్పు డు జాతిపిత, తెలంగాణ బాహుబలి అన్నావు కదా.., తెలంగాణకు కాళేశ్వరం వరప్రదాయని అని పలికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది నీవు కాదా.. అని ప్ర శ్నించారు. కడియం ధోరణి పాముకు పాలు పోసి పెంచి తే కాటేసినట్లుగా ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతో లాభం పొందిన నీవు తిన్నింటి వాసాలు లెకపెడుతూ మాట్లాడడం సరికాదన్నారు. నైతిక విలువలుంటే రాజీనామా చెయ్.. రానున్న ఎన్నికల్లో నువ్వా.. నేనా తేల్చుకుందామని రాజయ్య సవాల్ విసిరారు.