కులకచర్ల/ పరిగి, జులై 7: విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం బోధన జరిగేటట్లు చూడాలని మండల విద్యాధికారి గోపాల్ అన్నారు. సోమవారం పరిగిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. నాణ్యమైన మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు శుభ్రమైన, నాణ్యమైన ఆహారాన్ని వడ్డించాలని మధ్యాహ్న భోజన వంట ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు ప్రతిరోజు మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందించాలని, నాణ్యతలో తేడా ఉండరాదని సూచించారు.
పాఠశాలలో విద్యార్థుల చదువుపై విద్యార్థులతో మాట్లాడుతూ పాఠ్యాంశాల పరిజ్ఞానాన్ని పరిశీలించారు. అనంతరం వారికి విద్య ప్రాముఖ్యతను వివరించారు. ఉపాధ్యాయులందరూ విద్యార్థులందరికి పాఠ్యాంశ షెడ్యూల్ ప్రకారంబోధన జరిగేటట్టు చూడాలని, ఉపాధ్యాయులంతా సమయపాలన పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.కృష్ణా రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, సి ఆర్ పి చంద్రశేఖర్ పాల్గొన్నారు.