బంట్వారం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను వంద శాతం నమోదు చేయించాలని ఎంఈఓ చంద్రప్ప పేర్కొన్నారు. సోమవారం బడిబాటలో భాగంగా కోట్పల్లి మండల పరిధిలోని జిన్నారం, రాంపూర్, అన్న సాగర్, బుగ్గపూర్ తదితర గ్రామాల్లో పర్యటించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరు సమిష్టిగా కృషిచేసి గ్రామంలో ఉన్న విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ బడుల్లోని నాణ్యమైన విద్య అందుతుందని అంతేకాక విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం, ల్యాబ్ సదుపాయం, డిజిటల్ తరగతులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరేష్, మోహన్, తిరుమలయ్య, మల్లేశం, లక్ష్మణ్, అంజయ్య, శివప్రసాద్, సి అర్ పి నరేష్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.