నవాబుపేట,మే30 : ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతిచెందిన ఘటన నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవాబుపేట ఎస్ఐ అరుణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ పట్టణంలోని శివరాం నగర్ కాలనీకి చెందిన నాలాపురం సుధాకర్(43) గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై మోమిన్‌పేట నుంచి వికారాబాద్ వస్తుండగా గేట్‌వనంపల్లి గేట్ సమీపంలోకి రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి సుధాకర్‌కు తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అక్కడి నుంచి మెరుగైనా చికిత్స నిమిత్తం ఉస్మానియ హాస్పిటల్‌కు తరలించారు. శుక్రవారం సుధాకర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపారు.