కొడంగల్ : అనుమానాస్పదంగా వృద్ధుడు మృతి చెందిన సంఘటన కొడంగల్ మండల పరిధిలోని ఉడిమేశ్వరం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక చించోలికి చెందిన సాయప్ప మండలంలోని ఉడిమేశ్వరం గ్రామంలోని గురువారం రాత్రి ఎస్సీ కాలనీలో అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో గ్రామానికి చెందిన ఫకీరప్ప, మల్లప్పతో పాటు మరికొంతమంది అతనిని గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌కు తీసుకొచ్చి బంధించారు. ఆ తరువాత గ్రామ స్టేజీ వద్ద వదిలేసి వెళ్లినట్లు తెలిపారు. శుక్రవారం అతను ఆపస్మారక స్థితిలో ఉండటంతో కొడంగల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
చికిత్స నిర్వహిస్తుండగానే వృద్ధుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇట్టి విషయమై గ్రామంలోని కమ్యూనిటీ హాల్ వద్దకు తీసుకెల్లిన వారిని అనుమానితులుగా గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ అప్పయ్య తెలిపారు.