ధారూరు,ఆగస్టు 01 : ఉపాధ్యాయులకు వివిధరకాల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వేంటనే విడుదల చేయాలని వికారాబాద్ జిల్లా పిఆర్టియు అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ధారూరు మండల పరిధిలోని మున్నూరు సోమారం, కుక్కింద పాఠశాలలోని ఉపాధ్యాయులకు పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం సభ్యత్వం నమోదు చేయించారు.ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా పిఆర్టియు అధ్యక్షుడు కడియాల చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్లప్పుడు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పాఠశాల అభివృద్ది కొరకు పాటు పడే సంఘం పిఆర్టియు సంఘమే నని తెలిపారు.
పెండింగ్ లో ఉన్న వివిధ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు.పిఆర్సి రిపోర్టును కమిషన్ నుంచి తెప్పించుకొని త్వరగా పిఆర్సి 50శాతం పిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ధారూరు మండల పిఆర్టియు ఉపాధ్యా సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మాణిక్యం, గౌరవ అధ్యక్షుడు మల్లికార్జున్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్,రవీందర్ రెడ్డి,గుణవంత్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యం,సుదర్శన్,అశోక్, మండల కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, బిచ్చయ్య, నిజామోద్దీన్ తదితరులు ఉన్నారు.