పరిగి, డిసెంబర్ 6 : పేద విద్యార్థిని ఎంబీబీఎస్ చదువుకునేందుకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి ఆర్థిక తోడ్పాటు అందించారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం చాకల్‌పల్లి గ్రామానికి చెందిన పటేల్ సుదర్శన్ కూతురు పటేల్ స్వప్న గద్వాల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించారు.
వారి కుటుంబ ఆర్థిక స్థోమత అంతంతగానే ఉండడంతో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి విద్యార్థినికి ఫీజు కట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు మొదటి సంవత్సరం చెల్లించాల్సిన రూ.25వేలు శనివారం విద్యార్థిని స్వప్నకు ఆయన అందజేశారు. ఎంబీబీఎస్ పూర్తయ్యేంత వరకు ప్రతి సంవత్సరం తానే ఫీజు చెల్లిస్తానని ఆయన హామీనిచ్చారు. చక్కగా చదువుకొని గొప్ప డాక్టర్‌గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.