Registation Marriage | ప్రేమికులకు గుజరాత్ సర్కార్ షాక్.. రిజిస్ట్రేషన్ మ్యారేజి చేసుకోవాలంటే పేరెంట్స్‌కు చెప్పాల్సిందే!
Registation Marriage | ఇకపై గుజరాత్లో వివాహ రిజిస్ట్రేషన్ అంత సులభం కాదు. ప్రేమ వివాహాలు, రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై తల్లిదండ్రులకు తెలియకుండా పెండ్లి చేసుకుంటే ఆ రిజిస్ట్రషన్ ప్రక్రియలో వారు జోక్యం చేసుకునేలా కొత్త నిబంధలను ప్రభు త్వం రూపొందించింది.
Registation Marriage | అహ్మదాబాద్, ఫిబ్రవరి 20: ఇకపై గుజరాత్లో వివాహ రిజిస్ట్రేషన్ అంత సులభం కాదు. ప్రేమ వివాహాలు, రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై తల్లిదండ్రులకు తెలియకుండా పెండ్లి చేసుకుంటే ఆ రిజిస్ట్రషన్ ప్రక్రియలో వారు జోక్యం చేసుకునేలా కొత్త నిబంధలను ప్రభు త్వం రూపొందించింది. ముఖ్య ంగా తల్లిదండ్రులకు తెలియకుండా చేసుకునే ప్రేమ వివాహాలు, మతాంతర వివాహాల గురించి ఇరు వైపుల తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన ఆవశ్యకతను గుర్తించి ప్రభుత్వం ఈ మేరకు అడుగులు వేసింది.
ఈ మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వివాహ రిజిస్ట్రేషన్ చట్టాన్ని సవరించి పెండ్లిలో పారదర్శకత, తల్లిదండ్రుల ప్రమేయం తప్పనిసరి చేస్తూ అధిక పరిశీలన, బహుళ దశల ధ్రువీకరణ ప్రక్రియను అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవీ ప్రకటించారు.
ఈ ప్రతిపాదనలోని అత్యంత ముఖ్యమైన అంశం వధూవరుల డిక్లరేషన్. తమ వివాహం గురించి తమ తల్లిదండ్రులకు తెలుసో తెలియదో వారిద్దరూ అందులో ప్రకటించాలి. దీనిని మొక్కుబడిగా నిర్వహించరు. వధూవరులు దరఖాస్తులో ఇచ్చిన వివరాలు ఆధారంగా 10 రోజుల్లోగా ఇరువురి తల్లిదండ్రులకు తెలియజేయడం అసిస్టెంట్ రిజిస్ట్రార్ బాధ్యత. తల్లిదండ్రుల ఆధార్ కార్డు నుంచి వివాహ ఆహ్వానం వరకు అన్నీ సమగ్రంగా ఉండాలి. అలాగే గతంలో లాగా వెంటనే లేదా సల్ప కాల వ్యవధిలో వివాహ రిజిస్ట్రేషన్‌ను నమోదు చేయరు.
కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తు తేదీకి, సర్టిఫికెట్ జారీకి మధ్య 30 రోజుల వ్యవధి తప్పనిసరి. ఈ వ్యవధిలో వివాహ వీడియోలు, ఫొటోలు, సాక్షుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్రీకృతమై ఉన్న ఆన్లైన్ పోర్టల్‌కు అప్లోడ్ చేస్తారు.భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఒక పోర్టల్‌ను ఏర్పాటు చేస్తుందని, దీనిలో పెండ్లి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే వాట్సాప్, మెస్సేజ్ రూపంలో ఆ సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

