ధారూరు,మే 18 : రైతులు అధికంగా యూరియా వాడకాన్ని తగ్గించాలని తాండురు వ్యవసాయ పరిశోధనా ప్రధాన శాస్త్రవేత్త కె.పరిమళ రైతులకు సూచించారు. సోమవారం వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని మోమిన్కలాన్ గ్రామంలోని రైతు వేధికలో క్లస్టర్ స్థాయి రైతులకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తాండూరు వారి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు వ్యవసాయ పరిశోధనా ప్రధాన శాస్త్రవేత్త కె.పరిమళ మాట్లాడుతూ రైతులు యూరియా అధిక వినియోగం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతిని దీర్ఘకాలిక ఉత్సాదకత తగ్గుతుందని పేర్కొన్నారు.
రైతులు రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడాలని సూచించారు.
అధిక రసాయనాల వాడకం వల్ల పర్యావరణం, నేల తల్లి ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపారు. పురుగుల మందుల ప్రభావం వల్ల రైతులకు మేలు చేసే వానపాములు, మిత్ర పురుగులు కూడా నశిస్తున్నాయని తెలిపారు. అదనంగా మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలు సాగు చేసి అధిక ఆధాయం పోందాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సూర్యప్రకాష్, యంగ్ ప్రోఫెషనల్ సల్మాన్, వ్యవసాయ విస్తరణ అధికారులు హరిప్రసాద్, మల్లేశం, మోమిన్కలాన్ గ్రామ సర్పంచ్ మాధవి, మోమిన్ఖుర్దు గ్రామ సర్పంచ్ ప్రభాకర్ గౌడ్, నాయకులు, ప్రజాపతి నిధులు తదితరులు ఉన్నారు.