దోమ,ఆగస్టు 15 : ప్రభుత్వ పాఠశాలకు దాతలు సహకారం అందించడం అభినందనీయమని హెచ్ఎం వసురాం అన్నారు. శుక్రవారం దోమ మండల పరధిలోని దోర్నాల్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామానికి చెందిన దాతలు ప్రమోద్‌రెడ్డి, సందీప్ విద్యార్థులకు తరగతి గదలో కూర్చునేందుకు ఆరు డ్యుయెల్ డెస్క్ బెంచిలను అందజేసి సేవా భావాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది దాతలను శాలువాలతో సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవిందర్‌గౌడ్, శివకుమార్, పాఠశాల చైర్మన్ విజయలక్ష్మి, ఆదర్శ యువజన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.