కులకచర్ల, జూన్ 9 : పాఠశాలలకు దుస్తులు అందజేస్తున్నామని కులకచర్ల మండల మహిళా సమాఖ్య కోశాధికారి, పీరంపల్లి ప్రథమిక పాఠశాల కమిటీ చైర్మన్ చింతకాయల శ్రీలత అన్నారు. సోమవారం కులకచర్ల మండల పరిధిలోని కామునిపల్లి గ్రామంలో టైలర్ల ద్వారా కుట్టించి విద్యార్థుల యూనిఫామ్స్‌ను పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు కులకచర్ల మండలంలోని అన్ని పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు పాఠశాలల పుణఃప్రారంభానికి ముందుగానే దుస్తులను అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులకు రెండు జతల బట్టలు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి తమ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. ఈ సందర్భంగా యూనిఫామ్స్‌ను పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పార్వతి, అరుణ, వీవోఏ మొగులయ్య, నాయకులు జంగయ్య, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.