కొడంగల్, జూన్ 06 : బడీడు పిల్లలు బడిలో చేరే విధంగా కృషి చేయాలని డీఈవో రేణుక దేవి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ ప్రసాద్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనిత విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దాలని సూచించారు.
బడిబాట కార్యక్రమం పై ప్రత్యేక చర్య తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. బడివాడ కార్యక్రమంలో భాగంగా మూడు రోజులపాటు ఇంటింటిని సందర్శించి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించుటకు కృషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నాణ్యమైన విద్యను అందుకునే విధంగా డిజిటలైజేషన్ తరగతులు నిర్వహించేందుకు ప్రత్యేక చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ నిబంధలనలకు అనుగుణంగా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మసులుకోవాలని ఆదేశించారు. అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉషశ్రీ, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, ఎంఈఓ రామ్ రెడ్డి, సెక్టోరియల్ అధికారి రజిని తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.