పరిగి, జూలై 11 : పరిగి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెం.1లో విద్యార్థులకు శుక్రవారం దంత పరీక్షలు నిర్వహించారు. శ్రీ సాయి డెంటల్ అండ్ సర్జరీ కళాశాల వారి ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులకు దంత పరీక్షలు జరిపారు. డెంటల్ కళాశాల విద్యార్థులు మనీషా, జగదీష్, సాత్విక, సమరీన్, సాయికుమార్, ప్రజ్ఞ తదితరులు పాఠశాలలో 355 మంది విద్యార్థులను పరీక్షించగా 32 మంది విద్యార్థులకు చికిత్స అవసరమని గుర్తించారు.
వారు డెంటల్ కళాశాలకు వస్తే ఉచితంగా చికిత్స చేస్తామని తెలిపారు. దంతాల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. దంతాలను చక్కగా శుభ్రం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎం. గోపాల్, డెంటల్ కళాశాల పిఆర్వొ రవీందర్ గౌడ్ , పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.