నవాబుపేట, జూన్ 09 : ఇందిరమ్మ ఇండ్లు అర్హులకే దక్కాలి అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దయాకర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవకతవకలు జరగకుండా చూడాలని సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే తాము ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నట్లు తెలిపారు.
గ్రామాల్లో ఉన్న ప్రతి పేదవారికి కూడా న్యాయం జరిగేలా చూడాలని ఎంపీడీవోను కోరారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రచార కార్యదర్శి ఆసిరెడ్డిగారి వెంకట్ రెడ్డి, యూత్ వైస్ ప్రెసిడెంట్ బసిరెడ్డిగారి విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు.