పెద్దేముల్ : మండల పరిధిలో రచ్చకట్టతండాలో ఓ ఇంట్లో దాచి ఉంచిన ఎండిన గంజాయి మొక్కలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రచ్చకట్ట తండా గ్రామానికి చెందిన పూల్సింగ్ అనే వ్యక్తి తనకున్న రెండెకరాల పొలంలో సాగు చేస్తున్నాడు. నమ్మదగిన సమాచారం మేరకు వారి ఇంటిపై దాడులు చేయగా సుమారు రెండున్నర కిలోల గంజాయి దొరికింది. దీంతో పొలంలో సాగు చేసిన పూల్సింగ్పై కేసు నమోదు చేశామని తెలిపారు.
కాగా నిందితుడు పూల్సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుని పూర్తిస్థాయిలో విచారిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో తాండూరు ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రకాంత్, ఇతర ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.