వికారాబాద్, మే 25: గ్రామా పాలన అధికారి పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఆదివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గ్రామ పాలన అధికారి పరీక్షను నిర్వహించారు. పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్, అధికారులు పరిశీలించారు. ఈ పరీక్షకు 150 మంది అభ్యర్థులకు గాను 143 మంది అభ్యర్థులు హాజరు అయ్యారని కలెక్టర్ తెలిపారు.
ముందుగా జిల్లా కలెక్టర్ ప్రశ్నపత్రాలను సంబంధిత అధికారుల సమక్షంలో సీల్ ఓపెన్ చేశారు. కలెక్టర్‌తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, డిటిడిఓ కమలాకర్ రెడ్డి, ఆర్డీవో వాసు చంద్ర, తహసిల్దార్ లక్షీనారాయణ, ఈ-సెక్షన్ సూపరింటెండెంట్ నేహామత్ అలీ పాల్గొన్నారు.