వికారాబాద్, జూలై 7 : ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికివచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూవెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ భూ సమస్యలు, పెన్షన్ లకు సంబంధించి ఫిర్యాదులు సమర్పించారన్నారు.
ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదు దారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. సీఎంఓలో ప్రజావాణికి జిల్లా పై వచ్చిన ప్రజా ఫిర్యాదులను చెక్ చేసి దరఖాస్తు ఏ ప్రాసెస్‌లో ఉందో చెక్ చేసి ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్డీవో వాసు చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, సెక్షన్ సూపరింటెండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.