వికారాబాద్, జూలై 14 : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారి నుండి ప్రజావాణలో 126 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు అందరు సమయ పాలన పాటించాలని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పూర్తి స్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజావాణిలో 126 దరఖాస్తులు రాగా అందులో కలెక్టరేట్ సెక్షన్లలకు, రెవెన్యూ, ఇతర శాఖలకు సంబంధించిన ప్రజా ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. అర్జీదారుల దరఖాస్తులలో పేర్కొన్న సమస్యల పై క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో సుచంద్ర , వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.