పరిగి, ఏప్రిల్ 15 : ఈనెల 27వ తేదీన వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్‌ను పరిగిలో మంగళవారం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆవిష్కరించారు. పార్టీ నాయకులతో కలిసి ఆయన బహిరంగసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు సంబంధించి ప్రతి గ్రామంలో వాల్ పెయింటింగ్ చేయిస్తున్నట్లు చెప్పారు.
బహిరంగసభకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఒకటిరెండు రోజులలో మండల స్థాయిలో నాయకులు కూర్చొని ఏ ఊరుకు బస్సు పెట్టాలి, సొంత వాహనాలు ఎన్ని ఉన్నాయి తదితర వివరాలు అందజేయాలన్నారు. అందరు కలిసికట్టుగా సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.