ధారూరు, ఫిబ్రవరి 02 : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చాకలి లాలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ధారూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సినీయర్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్ జిల్లా ధారూరు మండలం కోండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన చాకలి లాలయ్య(35) తన కుమారుడు రిత్విక్(6)తో స్కూటర్‌పై వికారాబాద్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో రిత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. లాలయ్యకు తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
చికిత్స పొందుతూ లాలయ్య మృతి చెందాడు. వారి కుటుంబాన్ని పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లాలయ్య కుటుంబానికి రూ.20లక్షలు చొప్పున ఎక్సేగ్రిషియా చెల్లించాలన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వికారాబాద్ మండల పరిధిలోని బుగ్గ రామలింగేశ్వర దేవాలయం సమీపంలో ఉన్న రోడ్డు మూలమలుపు ఉన్న వద్ద ఆర్అండ్బీ అధికారులు చొరువ తీసుకుని స్పీడ్ బ్రేకర్లులను ఏర్పాటు చేయాలని, మూల మలుపు వద్ద ఉన్న చెట్లను అటవీశాఖ అధికారులు తొలగించాలని డిమాండ్ చేశారు. వీరి వెంట ధర్మాపూర్ సర్పంచ్ అనిల్‌కుమార్, వడ్డే యాదయ్య, చాకలి కొండయ్య, మనోహార్,నాయకులు తదితరులు ఉన్నారు.