Badi Bata | బొంరాస్ పేట/కొడంగల్, జూన్ 10: ప్రభుత్వ పాఠశాలలో బాలికల నమోదు లక్ష్యంగా గ్రామ గ్రామాన పర్యటిస్తుస్తూ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వికారాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయులు తిరుమలేశ్ తెలిపారు. మంగళవారం పట్టణ పరిధిలో బడిబాట కార్యక్రమంలో భాగంగా వినూత్నంగా పప్పెట్ షో ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం సాయంత్రం రాగిజావ అందిస్తున్నామని తెలిపారు. భోజన సదుపాయంతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, నోట్ బుక్స్ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా అన్నింటా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండటంవల్ల నాణ్యమైన విద్యాబోధన అందుకోవచ్చని తెలిపారు. విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానాలతోపాటు క్రీడా వస్తువులు, ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం ఉంటుందని అన్నారు. కాబట్టి విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలని కోరారు.
Badibata2
దుద్యాల మండల పరిధిలో
బడిబాట కార్యక్రమంలో భాగంగా దుద్యాల మండల పరిధిలోని జీడిగడ్డ తాండ, బొంరాస్ పేట మండల పరిధిలోని మద్దిమడుగు తాండలో మూడు గ్రూపులుగా ఉపాధ్యాయులు వారికి కేటాయించిన గ్రామాలలో పర్యటించారు. బడి ఈడు పిల్లల గుర్తింపు నమోదు ప్రక్రియను నిర్వహించారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను గురించి ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు