పరిగి, డిసెంబర్ 6: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సోమవారం పరిగిలో ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనం గా నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహానికి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి, కులకచర్ల, పూడూ రు ఎంపీపీలు కె.అరవిందరావు, సత్యమ్మ, మల్లేశం, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మం గు సంతోష్‌కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరిగిలో అంబేద్కర్ విగ్రహానికి పీఆర్ టీయూ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.అమర్నాథ్, రాష్ట్ర నాయకులు వీరేశం, మధుసూదన్, ఉస్మాన్అలీ, మండల ప్రధాన కార్యదర్శి మంచనపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అంబేద్కర్ కృషి ఫలితంగానే రిజర్వేషన్లు
అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాం డూరు, యాలాల, పెద్దేముల్, బషీరాబాద్ మండల కేంద్రాలతో పాటు పల్లె ల్లోని అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు ప్రజా ప్రతి నిధులు, రాజకీయపార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ అం బేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని వివరించారు. అంబేద్కర్ కృషి ఫలితంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని పేర్కొన్నా రు. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే విధానంలో సమాజంలో మార్పుకోసం అంబేద్కర్ పోరాడారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్ పర్సన్ దీప, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్‌నాయక్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఉన్నారు.
తాండూరు రూరల్, డిసెంబర్ 6 : తాండూరు మం డ లం బెల్కటూర్ గ్రామంలో సర్పంచ్ మధు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా అల్లాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సం ఘం, నాయకులు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కులకచర్ల మండల కేంద్రంలో..
కులకచర్ల మండల కేంద్రంలోని కులకచర్ల, ముజా హిద్పూర్, ఘనాపూర్ గోప్యనాయక్తండా పాఠశాలలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. కులకచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్ర మంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, సీఎంఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ భీంరెడ్డి, బీజేపీ నాయకులు కరణం ప్రహ్లాద్‌రావు పాల్గొన్నారు. ఈ సం దర్భంగా దళిత యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కా ర్యక్రమంలో సం ఘం అ ధ్యక్షుడు నర్సింహు లు, ప్రధాన కార్యదర్శి ఆం జనేయులు, మల్లేశ్, వెంకటయ్య, వెంకటే శం, ఎంపీటీసీ రాం లాల్, నాయకులు వెంకట్రాము లు, సంఘం సభ్యు లు పాల్గొనగా చౌడాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ కొత్త రం గారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మ న్ నాగరాజు, వార్డుసభ్యుడు అశోక్, బంజారా నాయకు లు కిషన్‌నాయక్, నాయకులు బందయ్య, వెంకటేశ్, రాజశేఖర్, రామకృష్ణ, నరేశ్, బాల్‌రాజ్, నరేశ్, ప్రభు, శ్రీను, విజయ్ కుమార్, శ్రీకాంత్, నర్సింహులు పాల్గొన్నారు.
అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని బషీరాబాద్ సర్పంచ్ ప్రియాంక అన్నారు. సోమవారం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ఎమ్మార్పీఎస్ నాయకులు కృష్ణ, కిష్టప్పలతో కలిసి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు శ్రవణ్‌కుమార్, వడ్డే హన్మంతు, బన్సీలాల్, రియా జ్, క్యాద్గీరా అర్జున్, నరేశ్ ఉన్నారు.
అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు యువజన సం ఘం నాయకులు తెలిపారు. సోమవారం మండల కేం ద్రంతోపాటు, గొట్లపల్లి గ్రామంలో జైభీమ్ యువజన సం ఘం,అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజ్యాంగంలో అందరి కీ సమానా హక్కులను కల్పించి, భారతదేశ ఖ్యాతిని ప్ర పంచ దేశాలకు తెలిసే విధంగా పాడుపడిన మహానీయుడని గుర్తు చేశారు. కార్యక్రమంలో జైభీమ్,అంబేద్కర్ యువ జన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
సమసమాజ స్థాపనే లక్ష్యం
సమసమాజ స్థాపనే అంబేద్కర్ లక్ష్యమని సర్పంచ్ నవ్యారెడ్డి, అంబేద్కర్ మండల యువజన సంఘాల నేత రాజేందర్ పేర్కొన్నారు. పూడూరు, అం గడి చిట్టంపల్లి, కం డ్లపల్లి, కంకల్, పెద్ద ఉమ్మెంతాల్, చిం తల్పల్లి, మటుగూడ గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ జయమ్మ, నేతలు తాజొద్దీన్, రవి, చంద్రయ్య, రాంచంద్రయ్య, నర్సింహాచారి ఉన్నారు.