వికారాబాద్, జూలై 6 : సీజనల్ వ్యాధుల కట్టడికి ముందస్తు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ జడ్పీ కార్యాలయంలో జడ్పీ నిధులతో గ్రామా ల్లో చేపట్టిన పనులు, అన్ని ప్రభుత్వ శాఖ ల పనితీరుపై శాఖల వారీగా ఆమె సమీక్ష నిర్వహించారు. ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్య, వైద్యం, గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్యం, జాతీ య ఉపాధి హామీ పథకం, విద్యుత్తు, గ్రా మీణ అభివృద్ధి తదితర అంశాల్లో ఇప్పటి వరకు సాధించిన పురోగతి, కొత్తగా ప్రతిపాదించిన పనుల వివరాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.
వ్యవసాయం, విద్యావైద్యం, గ్రామీణ అభివృద్ధి పనులు, ఫైనాన్స్, సాంఘిక సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమం స్థాయీ సంఘాలపై విస్తృతంగా సమీక్ష జరిపారు. 10వ తరగతిలో జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచిందని, వచ్చే ఏడాది ఇలా జరుగకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా విద్యాబోధన జరుగాలని ఆమె విద్యాశాఖ అధికారులకు సూచించారు. వర్షాకాలం కావడంతో గ్రా మాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ అప్రమత్తంగా ఉండి తగిన చర్య లు తీసుకోవాలని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటాలన్నారు.
రూర్బన్ కింద రూ. 2 కోట్లతో ప్రారంభమైన ఆడిటోరియం, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ కింద మరో రూ.2 కోట్లతో చేపట్టిన స్టేడియం పనులు ఎందు కు ఆగిపోయాయని అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను వెంటనే మార్చి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడు తూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని.. రానున్న స్థాయీ సంఘాల సమావేశానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు తప్పసరిగా హాజరుకావాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ స్థాయీ సంఘం చైర్మ న్ విజయ్‌కుమార్, సాంఘిక సంక్షేమ స్థా యీ సంఘం చైర్పర్సన్ అరుణదేశ్, మహిళా, శిశు సంక్షేమ స్థాయీ సంఘం చైర్పర్సన్ సుజాత, జడ్పీ ఇన్చార్జీ సీఈవో సుభాషిణి, జడ్పీటీసీలు నాగిరెడ్డి, ధారాసింగ్, రాందాస్, హరిప్రియ, మేఘామాల, అధికారులు పాల్గొన్నారు.