పూడూరు : యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు పండించుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. ఆదివారం పూడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. యాసంగి సీజన్లో పండించే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయడం లేదన్నారు. వ్యవసాయాధికారులు రైతులకు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. రైతులు ప్రతిసారి ఒకే పొలంలో వరిసాగు చేస్తే దిగుబడి రాక రైతులు నష్టపోతరన్నారు.
ఆరుతడి పంటల సాగుచేస్తే భూసారాన్ని రక్షించుకోవచ్చన్నారు. డ్రిప్ విదానంతో తక్కువ నీటితో ఎక్కవ పంటలు సాగు చేసి లాభాలు పొందవచ్చాన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. వీరితో పాటు జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి రాజేశ్వర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విమల, ఏవో సామ్రాట్రెడ్డి, మల్లేశం, రైతులు ఉన్నారు.