వికారాబాద్, ఆగస్టు 4 : వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డి గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు ఆదివారం జాండీస్ సోకాయి. దీంతో పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం 15 నుంచి 20 మంది విద్యార్థులను వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు.
విషయం తెలుసుకున్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే వికారాబాద్ పట్టణంలోని బూరుగుపల్లి సమీపంలో బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థినులకు జ్వరాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గురుకుల పాఠశాలల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.