మూడింటికి మూడాఫ్!
మూడింటి మూడాఫ్.. డెస్క్ ఉద్యోగులను కలవర పెడుతున్నది. మధ్యాహ్నం అయ్యిందంటే.. అనేకమందిలో అలసట వచ్చేస్తున్నది. దానివెంటే నిద్రకూడా ముంచుకొస్తున్నది. ఉద్యోగుల్లో శక్తి తగ్గిపోయి, నీరసించిపోయి, ఏకాగ్రత కోల్పోయి.. మొత్తంగా పనిమీదే ఇంట్రెస్ట్ లేకుండా పోతున్నది. దీనినే ‘3 పీఎం క్రాష్' అని కార్పొరేట్ ప్రపంచం ముద్దుగా పిలుచుకుంటున్నది.
మూడింటి మూడాఫ్.. డెస్క్ ఉద్యోగులను కలవర పెడుతున్నది. మధ్యాహ్నం అయ్యిందంటే.. అనేకమందిలో అలసట వచ్చేస్తున్నది. దానివెంటే నిద్రకూడా ముంచుకొస్తున్నది. ఉద్యోగుల్లో శక్తి తగ్గిపోయి, నీరసించిపోయి, ఏకాగ్రత కోల్పోయి.. మొత్తంగా పనిమీదే ఇంట్రెస్ట్ లేకుండా పోతున్నది. దీనినే ‘3 పీఎం క్రాష్’ అని కార్పొరేట్ ప్రపంచం ముద్దుగా పిలుచుకుంటున్నది. దీనివల్ల ఉద్యోగాలకే ముప్పువాటిల్లే ప్రమాదం ఏర్పడనున్నది. మరి, ఆ క్రాష్‌లో పడిపోవద్దంటే.. ఈ సూచనలు పాటించాల్సిన అవసరం ఉన్నది.
ఏ ఉద్యోగి అయినా.. ఉదయాన్నే ఉత్సాహంగా ఆఫీస్‌కు వెళ్తారు. మధ్యాహ్నం వరకూ అలుపెరగకుండా పనిచేస్తారు. అలా లంచ్ అయ్యిందో లేదో.. ఇలా ‘3 పీఎం క్రాష్’లోకి జారిపోతారు. సత్తువ కోల్పోయి, ఏకాగ్రత తగ్గిపోయి.. పనిని పక్కన పెట్టేస్తారు. ఒక చిన్న కునుకు తీయాలని ఆశపడతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెస్క్ ఉద్యోగుల్లో చాలామంది ఇదే సమస్యతో బాధపడుతున్నారట. ఇందుకు కారణాలు అనేకం.
- ‘3 పీఎం క్రాష్’కు గురికావడానికి ప్రధాన కారణం.. మన సిర్కాడియన్ రిథమ్. మన శరీరంలోని ఈ అంతర్గత గడియారం ప్రకారం.. ప్రతి ఒక్కరి శరీరం రాత్రి 2-4 గంటల మధ్య, మధ్యాహ్నం 1-3 గంటల మధ్య సహజంగానే విశ్రాంతిని కోరుకుంటుందట. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గుతాయి. మెదడుకు నిద్రపోవాలనే సంకేతాలు అందుతాయి. దాంతో సహజంగానే నిద్ర ముంచుకొస్తుంది.
- మధ్యాహ్న భోజనం అదుపు తప్పితే.. ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. లంచ్‌లో అన్నం, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరుగుతాయి. దాంతో ఆ చక్కెరను తగ్గించడానికి శరీరం ఇన్సులిన్ విడుదల చేస్తుంది. ఫలితంగా చక్కెర స్థాయులు అంతే వేగంగా పడిపోతాయి. షుగర్ హెచ్చుతగ్గులు.. శరీరాన్ని నీరసానికి గురిచేస్తాయి. అంతేకాకుండా మధ్యాహ్నం తిన్న ఆహారాన్ని అరిగించడానికి శరీరం తన శక్తిలో ఎక్కువ మొత్తాన్ని జీర్ణవ్యవస్థ వైపే మళ్లిస్తుంది. దాంతో మెదడుతోపాటు ఇతర శరీర భాగాలకు శక్తి తక్కువై.. నిద్రమబ్బు ముంచుకొస్తుంది.
- రాత్రిపూట సరైన నిద్ర లేకపోతే.. దాని ప్రభావం మధ్యాహ్నం పూట కనిపిస్తుంది. ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు మెదడు నిస్ర్తాణంగా మారిపోతుంది. నిద్ర కోసం ఒత్తిడి చేస్తుంది. అంతేకాకుండా గంటల తరబడి కదలకుండా కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. కండరాలు కదలకపోవడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గి.. బద్ధకం ఆవహిస్తుంది. ఇది ‘3 పీఎం క్రాష్’కు దారితీస్తుంది.
- డీహైడ్రేషన్ వల్ల కూడా ‘ 3 పీఎం క్రాష్’ తలెత్తుతుంది! రోజంతా ఏసీ గదుల్లో ఉండటం వల్ల అంతగా దాహం వేయదు. కానీ, శరీరానికి తగినంత నీరు కావాల్సిందే! దాంతో బాడీ డీహైడ్రేషన్‌కు గురై.. మెదడు చురుకుదనం కోల్పోతుంది.
మరేం చేయాలి?
- ఈ ‘3 పీఎం క్రాష్’ నుంచి బయట పడాలంటే.. కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాలి.
- మధ్యాహ్నం భోజనం భారీగా ఉండకుండా చూసుకోవాలి. అన్నం తగ్గించి, కూరగాయలు, ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. భోజనం తర్వాత 10 నిమిషాలపాటు ఆవరణలో నడవాలి.
- టీ, కాఫీలు తాగడానికి ముందు.. ఒక గ్లాసు చల్లని నీరు తాగాలి. దీనివల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. మెదడు చురుకుగా మారుతుంది.
- ప్రతి 45 నిమిషాలకు ఒకసారి పనికి పాస్ ఇచ్చి.. కుర్చీలోనే చిన్నగా స్ట్రెచెస్ చేయండి. మెడ, కాళ్లు-చేతులు, వెన్నెముకను ఒకసారి స్ట్రెచ్ చేస్తే.. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు ఆక్సిజన్ అంది.. నిద్రమత్తు వదిలిపోతుంది.
- వీలున్నపుడల్లా కుర్చీలోంచి లేచి.. నాలుగు అడుగులైనా వేయాలి. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, ప్రింట్స్ తీసుకుంటున్నప్పుడు, సహోద్యోగులతో చర్చిస్తున్నప్పుడు.. అలా నడవడం అలవాటు చేసుకోండి.
- డెస్క్ ఏరియాలో ప్రకాశవంతమైన వెలుతురు ఉండేలా చూసుకోండి. అలా వీలులేకుంటే.. కిటికీలోంచి బయట వెలుతురు కాసేపు చూడండి. ఈ అలవాటు.. మీ మెదడుకు ఇంకా నిద్రపోయే సమయం కాలేదనే సంకేతాన్ని అందిస్తుంది.
- నీరసం ఎక్కువైనప్పుడు కష్టమైన పనిని పక్కన పెట్టేయండి. మెదడుపై తక్కువ భారం పడే చిన్నచిన్న పనులు చేసుకోండి.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

