Vikarabad : ఆపదలో ఆపన్న హస్తం సీఎం రిలిఫ్ ఫండ్..

యాలాల : సీఎం రీలీప్ ఫండ్ ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తుందని ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎంమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు, ధారూర్ మండలాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు రూ. 4,080 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. తాండూరు పట్టణానికి చెందిన ఇబ్రహీంకు రూ. లక్ష, అశోక్‌రెడ్డికి రూ. 12వేలు, తాండూరు మండలం దస్తగిరిపేట గ్రామానికి చెందిన శంకరప్పకు రూ. 1. 50 లక్షలు, రాఘవాచారికి రూ. 68వేలు, ధారూర్ మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన మంజులకు రూ. 1.50 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి కార్యకర్తను పార్టీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనేకమంది నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్‌లో కూడా నియోజకవర్గంలోని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నిరుపేదలకు అండగా ఉంటానన్నారు. అంతేకాకుండా వారికి కార్పొరేటు వైద్యం అందించడం జరుగుతుందన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

