మాదాపూర్, జూన్ 14 : అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద నుండి కిలో గంజాయి లభ్యమైంది. శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన మంగళవారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది.
ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం .. పాపిరెడ్డి కాలనీకి చెందిన ఇద్దరు యువకులు రాజేష్ చరణ్ (21), సూర్యతేజ (28)లు మంగళవారం ఉదయం గచ్చిబౌలి స్టేడియం వద్ద అనుమనాస్పదంగా కనిపించారు. శంషాబాద్ ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఇరువురిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద కేజీ గంజాయి లభించింది.
దీంతో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి గంజాయితో పాటు వారి వద్ద ఉన్న స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు శేరిలింగంపల్లి ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్ తెలిపారు.