Ranveer Singh | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
Ranveer Singh | బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) కు బిష్ణోయ్ (Bishnoy) గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. రణ్వీర్ను, అతడి దగ్గర పనిచేస్తున్న వారినీ చంపేస్తానని బిష్ణోయ్ అనుచరుడి పేరుతో ఓ దుండగుడు హెచ్చరించాడు.
Ranveer Singh : బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ (Ranveer Singh) కు బిష్ణోయ్ (Bishnoy) గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. రణ్వీర్ను, అతడి దగ్గర పనిచేస్తున్న వారినీ చంపేస్తానని బిష్ణోయ్ అనుచరుడి పేరుతో ఓ దుండగుడు హెచ్చరించాడు. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty) ని కూడా ఇదే తరహాలో బెదిరించాడు. ఈ మేరకు వాట్సాప్‌లో ఓ ఆడియో సందేశం పంపించినట్లు సమాచారం.
ఈ బెదిరింపు సందేశంతో బాలీవుడ్ లో కలకలం రేగుతోంది. తనను తాను బిష్ణోయ్ అనుచరుడిగా పేర్కొంటూ హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. తన డిమాండ్లను అంగీకరించకపోతే ఆ సెలెబ్రిటీలతోపాటు వారి సిబ్బందినీ హత్య చేస్తామని హెచ్చరించాడు. భవిష్యత్తులో ఏడు తరాలకు గుర్తుండి పోయేలా హత్య జరుగుతుందని వార్నింగ్ ఇచ్చాడు.
‘రణ్వీర్ సింగ్.. భవిష్యత్తులో ఏడు తరాలకు గుర్తుండిపోయేలా నిన్ను హత్య చేస్తాం. నువ్వు మా బెదిరింపులను లెక్క చేయకపోగా మిగతా వారికీ ఉచిత సలహాలు ఇస్తున్నావు. పోలీసులకు ఫిర్యాదు చేసేలా వారిని ప్రోత్సహిస్తున్నావు. నువ్వు కూడా ఓ కంప్లెయింట్ చేసినట్టున్నావు. పర్వాలేదు. ఇక నీకు మామూలుగా చెప్పం. నీ దగ్గర ఎవరెవరు పనిచేస్తున్నారు.. వారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళతారు..? వారి కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయనే వివరాలు మొత్తం మా దగ్గర ఉన్నాయి. వారితో మొదలు పెడతాం. ఒక్కొక్కరినీ టార్గెట్ చేసి చంపేస్తుంటే అప్పుడు నీకు తెలిసివస్తుంది. నీకు ఇంకా టైమ్ ఉంది. హత్యలు మొదలయ్యేలోపే మేలుకో’ అంటూ దుండగుడు తన ఆడియో సందేశంలో బెదిరించాడు. దర్శకుడు రోహిత్ శెట్టికి కూడా ఇది వర్తిస్తుందని అన్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

