నేటి శివరాత్రి వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని పలు శివాలయాలు ముస్తాబయ్యాయి. నిర్వాహకులు పోటీపడి ఆలయాలను అందంగా తీర్చిదిద్దారు. మామిడాకుల తోరణాలు, రకరకాల పూలతో దేవాలయాలను అలంకరించారు.
విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడంతో రాత్రుల్లో ఆలయాలు ధగధగ మెరుస్తున్నాయి. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని కమిటీల సభ్యులు సకల సౌకర్యాలను కల్పించారు.
-న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ