రంగారెడ్డి, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : హరిత లక్ష్యం ఖరారైంది. 2024 లో రంగారెడ్డి జిల్లాలో 25 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి యేటా 70-80 లక్షల వరకు మొక్కలను నాటించేలా వివిధ శాఖలు చర్యలు చేపట్టాయి.
ఈ లెక్కన గత తొమ్మిదేండ్ల కాలంలో జిల్లావ్యా ప్తంగా 8.27 కోట్ల మొక్కలను నాటారు. గత ప్రభుత్వం హరితహారానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వగా.. ఈసారి ఆ కార్యక్రమానికి ప్రాధాన్యత తగ్గించడం చర్చ నీయాంశంగా మారింది. మొక్కలను నాటేందుకు స్థలాలు లేవని కొన్ని శాఖలు చేతులెత్తేయడంతో టార్గెట్ తగ్గింది. ఎండలు మండుతున్న తరుణంలో నర్సరీల్లో మొక్కల సంరక్షణ సైతం అధికారులకు పెను సవాల్‌గా మారింది.
ప్రతి ఏటా గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖలు సంయుక్తంగా హరిత లక్ష్యాన్ని నిర్ణయిస్తాయి. వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించి ఏ యే శాఖలు ఎంత మేర మొక్కలు నాటాల్సి ఉంటుందో.. నిర్ణయం తీసుకుంటారు. ఈ ఏడాది హరితహారం టార్గెట్ కోసం నిర్వహించిన సమావేశంలో చాలా వరకు శాఖల ఆఫీసర్లు మొక్కలు నాటేందుకు నిరాసక్తత చూపారు. ఇందుకు స్థలాలు లేవన్న కారణాన్ని చూపించారు. దీంతో ఈ ఏడాది హరితహారం లక్ష్యాన్ని కేవ లం 25 లక్షల మొక్కలకే పరిమితం చేశారు. 2025లో 23 లక్షలు, 2026లో 22 లక్షల మొక్కలను నాటేలా మూడేండ్ల లక్ష్యాన్ని నిర్దేశించారు.
కేసీఆర్ ప్రభు త్వంలో ఒక ఏడాదిలోనే కోటి మొక్కలను నాటిన సందర్భాలున్నాయి. కానీ.. కొత్త ప్రభుత్వంలో మూడేండ్ల టార్గెట్ మొత్తం కలిపి 80 లక్షలు కూడా దాట కపోవడం గమనార్హం. గతంలో అన్ని ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యమై హరి తహారాన్ని సక్సెస్ఫుల్ చేశాయి. అయితే..ఈసారి డీపీవో, వ్యవసాయ, ఇరిగే షన్, ఎక్సైజ్, హెల్త్, హార్టికల్చర్, ఎండోమెంట్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైన్స్, మార్కెటింగ్, సివిల్ సప్లయ్ శాఖలకు టార్గెట్స్ లేకపోవడంతో ఆయా శాఖలు హరితహారం కార్యక్రమానికి దూరంగా ఉండనున్నాయి.
జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో..పంచాయతీకో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల కారణంగా మొక్కల పెంపకం ప్రక్రియ ఈసారి ఆలస్యమైనది. కొన్ని నర్సరీల్లో మొక్కలు కొంత మేర పెరగగా.. మరికొన్ని చోట్ల ప్లాస్టిక్ కవర్లలో మట్టిని నింపి మొక్కలు నాటే పనులు జరుగుతు న్నాయి. వర్షాకాల ప్రారంభం అంటే జూన్ నెల వరకు మొక్కలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
అయితే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మొక్కలను సంరక్షించడం అధికారులకు సవాల్‌గా మారింది. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండడంతో బోర్లలో నీటి మట్టాలు తగ్గి మొక్కలకు నీళ్లు అందడంలేదు. పలు చోట్ల పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూ మొ క్కలను సంరక్షిస్తున్నారు. గ్రీన్ నెట్లు లేకపోవడం.. ఇతరత్రా కారణాలతో అక్క డక్కడా నర్సరీల్లో మొక్కలు ఎండిపోతుండడంతో వాటి స్థానంలో మళ్లీ విత్తనాల ను నాటే ప్రక్రియను చేపడుతున్నారు.