మన సంక్షేమ పథకాలు.. దేశానికే ఆదర్శం
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.. తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఒక రోల్ మాడల్‌గా చేసేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్‌తో పని చేస్తున్నారు.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదు..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.
- తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవు..
- సీఎం కేసీఆర్ ఒక విజన్‌తో పని చేస్తున్నారు
- వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు
- రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి
- బడంగ్‌పేట పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం
‘తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.. తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఒక రోల్ మాడల్‌గా చేసేందుకు సీఎం కేసీఆర్ ఒక విజన్‌తో పని చేస్తున్నారు.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదు..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్‌పేట మున్సిపల్ పరిధిలోని పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట్రం రాక ముందు కరెంటు ఎప్పుడు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో తెలియకపోయేదని, రాష్ట్రం వచ్చాక వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా అవుతున్నదన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందినవారు బీఆర్ఎస్లో చేరారు. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా బడంగ్‌పేట ప్రాంతమంతా గులాబీమయమైంది.
బడంగ్‌పేట, మార్చి 26 : తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఒక రోల్ మోడల్‌గా చేయడానికి సీఎం కేసీఆర్ ఒక విజన్‌తో పనిచేస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి శ్రేణులు భారీగా తరలిరావడంతో బడంగ్‌పేట గులాబీమయంగా మారింది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వం రాష్ర్టానికి శ్రీరామ రక్ష అన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా.. తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల అండదండలు ఉన్నంత కాలం కేసీఆర్‌ను ఎవరూ ఏమీ చేయలేన్నారు. ఎనిమిది సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు. అభివృద్ధి కోసమే పనిచేస్తామన్నారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి బీఆర్ఎస్ పనిచేస్తుందని మంత్రి తెలిపారు.
24 గంటల విద్యుత్ సరఫరా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24 గంటలపాటు విద్యుత్ సరఫరా అవుతున్నదన్నారు. అంతక ముందు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితులు ఉండేవన్నారు. దీంతో ప్రజలు, రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడేవారన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుదన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కరెంట్ సమస్య తీవ్రంగా ఉందని అక్కడి రైతులు ఆందోళన చేస్తున్న సంఘటనలు చూస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరు
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని కేంద్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ అన్నారు. రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాల గురించి బస్తీలు, గ్రామాలలో ప్రజలకు వివరించవలసిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవలసిన బాద్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ప్రజల దగ్గరకు వస్తున్న పార్టీలను కార్యకర్తలు, ప్రజలు నిలదీయాలన్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించినా చర్యలుంటాయన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కంకణబద్దులై పనిచేయాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి రోజూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న మంత్రి సబితారెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న ఆమెపై ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు బాలకిషన్, అరవింద్‌శర్మ, లక్ష్మీనర్సింహ, కార్పొరేటర్లు అర్జున్, మమత, స్వప్న, శోభ, శ్రీనివాస్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ప్రసన్న, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఇంటింటికీ తాగునీరు
గతంలో నీటి కోసం ముష్టియుద్ధాలు చేసిన సందర్భాలు కోకొల్లలు. బిందెలతో రోడ్లపై క్యూ కట్టిన రోజులు చూశామన్నారు. మహిళల నీటి కష్టాలు చూసిన ముఖ్య మంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయానికి మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి సమస్యను పరిష్కరించారని తెలిపారు. నిరంతరం రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రిపై ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. ఇక నుంచి ప్రతి డివిజన్లో ఆత్మీయ సమ్మేళనాలు పెట్టాలన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

